హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పీసీసీఎఫ్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అర్హులైన అధికారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పీసీసీఎఫ్ రేసులో సీనియర్ అధికారులు రత్నాకర్ జౌహరీ,సునీత ఎం భగవత్, వినయ్‌కుమార్ ఉన్నట్టు సమాచారం.