హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): సింగూరు ప్రాజెక్టు కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో జరిగిన హైపవర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈపీసీ పద్దతిలో కుడి ఎడమ కాల్వ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి 2005లో నాటి ప్రభుత్వం రూ.84.45 కోట్లతో టెండర్ పిలవగా.. పలు కారణాలతో ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. పనులు ఆలస్యం అవుతుండటంతో ఏజెన్సీ దగ్గర మిగిలిన పనులకు సంబంధించిన నిధులు పోనూ ప్రభుత్వం వద్ద ఉన్న బ్యాంక్ గ్యారంటీని మినహాయించుకుని మిగిలిని డబ్బును చెల్లించేందుకు హైపవర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.