శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 21:00:48

వ‌డ‌గండ్ల బాధితుల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం

వ‌డ‌గండ్ల బాధితుల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం

హైద‌రాబాద్: వ‌డ‌గండ్ల బాధిత రైతాంగానికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బాస‌ట‌గా నిలుస్తామ‌న్నారు. వ‌డ‌గండ్ల బాధితుల క‌డగండ్లు తీరుస్తామ‌ని, పంటలు న‌ష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకుంటామ‌ని, ఈ విష‌యాల‌ను సిఎం దృష్టికి తీసుకెళ్ళిన‌ట్లు మంత్రి తెలిపారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సాయంత్రం భారీగా కురిసిన గాలి వాన‌, వ‌డ‌గండ్ల‌కు మామిడి, వ‌రి, మక్క‌జొన్న‌రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఈ విషయాలు తెలుసుకున్న వెంట‌నే మంత్రి ద‌యాక‌ర్ రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. 

సంబంధిత రెవిన్యూ, వ్య‌వ‌సాయ అధికారులు వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి, పంటల న‌ష్టాల అంచ‌నా వేయాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ రైతాంగానికి నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు. గురువారం సాయంత్రం అకాలంగా, అనుకోకుండా వ‌చ్చిన భారీ గాలులు, వ‌డ‌గండ్ల వాన‌లు రైతాంగాన్ని అత‌లాకుత‌లం చేశాయి. పాల‌కుర్తి మండ‌లంలోని అనేక గ్రామాల్లో మామిడి, వ‌రి, మ‌క్క జొన్న పంట‌లు భారీగా న‌ష్ట‌పోయాయి. మామిడి పిందె ద‌శ‌లోనే భారీగా రాలిపోయింది. పొట్ట‌కు వ‌చ్చిన వ‌రి గొలుసులు నేల రాలాయి. జొన్న పంట‌లు కూడా తీవ్ర న‌ష్టానికి గురైంది. ఈదురు గాలుల‌కు కొన్ని ఇండ్ల పై క‌ప్పులు లేచిపోయాయి.

 విద్యుత్ స్తంభాలు కొన్ని విరిగిప‌డ్డాయి. మ‌రోవైపు దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల మండ‌లాల్లో పాక్షిక న‌ష్టాలు సంభ‌వించాయి. దేవ‌రుప్పుల మండ‌లంలోని గోప్యానాయ‌క్ తండాలో భారీ గాలిదుమారానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ విరిగిప‌డింది. కొన్ని చోట్ల పంటల న‌ష్టాలు సంభ‌వించాయి. రాయ‌ప‌ర్తి, తొర్రూరు, పెద్ద వంగ‌ర మండ‌లాల్లోనూ పాక్షిక న‌ష్టాలు సంభ‌వించాయి. ఈ విష‌యాలు తెలిసిన వెంట‌నే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంబంధిత అధికారుల‌తో మాట్లాడారు. శుక్ర‌వారం ఉద‌యమే క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ఆదేశించారు. సాయంత్రానికల్లా పంట న‌ష్టాల అంచ‌నాలు అందించాల‌ని ఆదేశించారు. మ‌రోవైపు ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. పంటలు న‌స్ట‌పోయిన రైతాంగానికి ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకోవ‌డానికి వీలైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పంట‌లు న‌ష్ట‌పోయిన  రైతాంగం అధైర్య ప‌డొద్ద‌ని, వారికి ప్ర‌భుత్వం, తాను అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.


logo