ఆరుట్ల బడిని అభివృద్ధి చేసింది కేసీఆరే
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆరుట్ల స్కూల్లో బుధవారం బ్రేక్పాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తూ తానేదో పాఠశాలను అభివృద్ధి చేశామన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
- కేవలం సున్నాలు వేసి తన గొప్పలుగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు
- ప్రైవేట్ సూల్స్‌ను ప్రోత్సహిం చేందుకే ప్రభుత్వ బడుల నిర్వీర్యం : గెల్లు శ్రీనివాస్
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆరుట్ల స్కూల్లో బుధవారం బ్రేక్పాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తూ తానేదో పాఠశాలను అభివృద్ధి చేశామన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేవలం గోడలకు సున్నాలు వేసి తన ఘనతగా చెప్పుకోవడం తగదని హితవుపలికారు.
ఆరుట్ల సూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని సీఎం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని సీఎం అంటున్నారని, ఏ జిల్లాలో ఎన్ని బడుల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయో చెప్పాలని సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణభవన్‌లో గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ సూళ్లను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గురుకులాల్లో అడ్మిషన్లకు బాగా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు పిల్లలను గురుకులాలకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫీజుల నియంత్రణ చట్టం కోసం పోరుబాట
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ విషయంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని గెల్లు శ్రీనివాస్ ప్రశ్నించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలనే డిమాండ్‌తో ఈ నెల 20న అన్ని మండలాల ఎంఈవోలకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. 22న అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణిలో ఫీజుల వసూళ్లపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విద్యామంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

