Runa Mafi | హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తించనున్నట్టు స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపులను కూడా వర్తింపజేయనున్న ట్టు పేర్కొన్నది. ఏ కుటుంబానికైనా రూ.2 లక్షలకు మించిన రుణం ఉంటే, ఎక్కువ ఉన్న ఆ మొత్తాన్ని ఆయా రైతులు బ్యాంకులకు చెల్లించాలని, ఆ తరువాతనే రుణమాఫీ నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న స్వల్పకాలిక పంట రుణాలను మాత్రమే మాఫీ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
బ్యాంకుల నుంచి రైతుల, రుణాల వివరాలను ప్రత్యేక పోర్టల్ ద్వారా సేకరించనున్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించి దీని ద్వారా రుణమాఫీ చేస్తారు. ప్రతి బ్యాంకు నుంచి ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. ఈ అధికారి ఇటు వ్యవసాయ శాఖ, అటు ఎన్ఐసీ(పోర్టల్)కి అవసరమైన సమాచారం అందిస్తారు. రుణమాఫీలో రైతులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, సందేహాలను తీ ర్చేందుకు పోర్టల్ ద్వారా, మండల స్థాయిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది.
మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు