హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకొని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి అనేకమంది కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వంలో, పార్టీలో పనిచేస్తున్నట్టు చె ప్పారు.
ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చేరిన వారు పదవులు అనుభవిస్తున్నప్పటికీ పార్టీ పటిష్టతకు ప్రయత్నించడం లేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి మరో మూడేండ్ల సమ యం ఉన్నప్పటికీ చివరి ఏడాది ఎన్నికల సమయమని, మిగిలింది రెండేండ్లు మా త్రమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్ర క్షాళన అవసరమున్నదని స్పష్టంచేశారు. పక్షాళనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి న టరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి సమయం ఇవ్వాలని కోరారు. సంపత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం కావడంతో పాటు అసంతృప్తిని తేటతెల్లం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.