గద్వాల అర్బన్, ఫిబ్రవరి 26 : నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో అసలు సూత్రధారిని పట్టుకున్నట్టు డీఎస్పీ మొ గిలయ్య బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వ్యవహారంపై వ్యవసాయ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు చేపట్టగా ముందుగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అసలు సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను రిమాండ్కు తరలించారు. బీసీఏ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు.