జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో రూ.35లక్షలతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ శంకుస్థాపన, రూ.25లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ పసునూరి దయాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తున్నారని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో పయనిస్తుందని వెల్లడించారు. ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి చిట్యాల మండలం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీ గొర్రె సాగర్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.