MLC Kavitha : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ (MLC Kavitha) కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సర్కారు (Congress government) ప్రజాపాలనోత్సవాలు జరుపుకోవడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ఏడాది కాలంగా ప్రజల కోసం ఏం చేయకపోయినా కాంగ్రెస్ పాలకులు సంబురాలు చేసుకోవడాన్ని తాను ప్రశంసిస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇవ్వగలిగినన్ని హామీలు ఇచ్చిందని, వారి హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహా మరే ఒక్క హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదని కవిత విమర్శించారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, ఆ బస్సుల సంఖ్యను సర్కారు పూర్తిగా తగ్గించిందని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే మరోవైపు బస్సులు సరిపడా లేకుండా చేయడం ఒక రకంగా రాష్ట్ర మహిళలను అవమానించడమే అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏం చేయకపోయినా సర్కారు సంబురాలు చేసుకుంటుండటం చాలా విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నేతలు సంబురాలు చేసుకోవడం కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలతో కలిసి సంబురాలు చేసుకోవాలని ఆమె సూచించారు.
#WATCH | Hyderabad, Telangana: On one year of Congress government in the state, BRS leader K Kavitha says, “They came into power by giving all sorts of guarantees but have not fulfilled any except free bus rides for women. This has caused a reduction in the number of buses…… pic.twitter.com/VMYAdmoY7c
— ANI (@ANI) December 9, 2024
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కూడా కవిత స్పందించారు. తెలంగాణ తల్లి గడిచిన 70 ఏళ్లుగా మనతో ఉన్నదని, కానీ మన సెంటిమెంట్లతో ఆడుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని కవిత వ్యాఖ్యానించారు. కేవలం సోనియాగాంధీ పుట్టినరోజు కారణంతో, సోనియా దగ్గర పేరు సంపాదించాలనే స్వార్థంతో సీఎం రేవంత్రెడ్డి ఇవాళ తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు. ఈ చర్యను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
#WATCH | Hyderabad, Telangana: On the Telangana Thalli statue, BRS leader K Kavitha says, “… Telangana Thalli has always been with us for the past 70 years and we would not like any government to play with our sentiments. Just because it is Sonia Gandhi’s birthday and just… pic.twitter.com/dNeS3RH4IN
— ANI (@ANI) December 9, 2024