Bathukamma Sarees | హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత, వస్త్ర తయారీ రంగంలో సందిగ్ధం ఏర్పడింది. జనవరి గడిచినా బతుకమ్మ చీరలు, యూనిఫామ్స్‌కు ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్లు ఇవ్వకపోవటమే ఇందుకు కారణం. చీరల తయారీకి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మౌఖిక ఆదేశాలిచ్చినా అధికారికంగా ఆర్డర్ జారీ కాకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు నేతన్నలు, వస్త్ర పరిశ్రమ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయా? అన్న ఆందోళన మొదలైంది.
గతంలో ఏటా 550 కోట్ల ఆర్డర్లు
చేనేత కార్మికుల ఆకలి చావులను అరికట్టే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చేనేత చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఏటా సుమారు కోటి చీరలు మహిళలకు పంపిణీ చేస్తున్నారు. ఫలితంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నవారికి జీవనభృతి లభించేది. ఈ చీరల కోసం ప్రభుత్వం ఏటా రూ.350 కోట్ల వరకు చేనేత సంఘాలకు చెల్లించేది. అంతేకాదు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ వసతి గృహాలు, స్కూళ్లలో చదువుకునే పిల్లలు, పోలీస్‌శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల యూనిఫామ్స్ కూడా రాష్ట్రంలోని పాలిస్టర్ తయారీదారులనుంచి కొనుగోలు చేసేవారు. దీనికోసం మరో రూ.200 కోట్లకుపైగా ఖర్చుచేసేది. చీరలు, యూనిఫామ్స్ తయారీ కోసం చేనేత, పవర్లూమ్, పాలిస్టర్ వర్కర్లకు ప్రభుత్వం నుంచి ఏటా మొత్తంగా రూ.550 కోట్ల వరకు ఆర్డర్లు వచ్చేవి. ఏటా డిసెంబర్, జనవరిలోనే ఆర్డర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. ఇంకా ఇవ్వలేదు.
నిలిచిన యూనిఫామ్స్ తయారీ
ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చేనేత, పవర్లూమ్ కార్మికులు ప్రభుత్వం నుంచి అందాల్సిన వస్ర్తాల ఆర్డర్లు అందక వస్ర్తాల తయారీని జనవరి 15న నిలిపివేశారు. ప్రస్తుతం తమవద్ద దాదాపు రూ.70 కోట్ల విలువయ్యే పాలిస్టర్ వస్ర్తాల నిల్వలు ఉన్నాయని, చేసేదిలేక హైదరాబాద్ పత్తర్‌గట్టి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నామని పాలిస్టర్ క్లాత్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయా రు. చీరలు, యూనిఫామ్స్ తయారీ కోసం ఎ టువంటి నిర్ణయం వెలువడకపోవటంతో చేనే త, వస్త్ర తయారీదారులు తీవ్ర ఆందోళనలో ఉ న్నారని, పాలిస్టర్ క్లాత్స్ అసోసియేషన్, పవర్లూమ్ వర్కర్స్ ఇప్పటికే వస్ర్తాల తయారీని నిలిపివేశారని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి ఆర్డర్ ఇస్తే నేత పనులు, వస్ర్తాల తయారీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చీరల ఆర్డర్‌పై అధికారుల వివరణ కోరగా.. ఎలాంటి చర్యలూ చేపట్టలేదని స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరల పంపిణీ వివరాలు సంవత్సరాలవారీగా..