హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కార్యదర్శిగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బుర్రా వెంకటేశం గవర్నర్ కార్యదర్శిగా ఉండగా ఆయన టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇందూ అరణ్య కాలనీవాసులతో హౌసింగ్ బోర్డు చర్చలు ; ‘నమస్తే తెలంగాణ’ కథనంపై అధికారుల స్పందన
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నాగోల్ బండ్లగూడలోని ఇందూ అరణ్య పల్లవి హౌసింగ్ కాలనీలో పార్కు, ఇతర ఖాళీ జాగను స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని హౌసింగ్ బోర్డు విరమించుకున్నది. ‘ఇందూ అరణ్య హౌసింగ్ కాలనీపై హౌసింగ్ బోర్డు జులుం’ శీర్షికతో బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై హౌసింగ్ బోర్డు అధికారులు స్పందించారు. బుధవారం ఆ కాలనీవాసులతో చర్చించారు. వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతర సమస్యల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేశారు.