హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. బుధవారం శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు సమాచారం అందే వ్యవస్థలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా ప్రత్యేక వెబ్సైట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ దానిని నిర్వర్తించడం లేదని తెలిపారు. వెబ్సైట్లో చిన్నచిన్న బదిలీలు, జీవోలు మాత్రమే ఉంచి, ముఖ్యమైన టెండర్లు, నిధుల కేటాయింపులు వంటి కీలక జీవోలు ‘క్లాసిఫైడ్’ ‘కాన్ఫిడెన్షియల్’ పేరుతో ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడం ఎందుకని నిలదీశా రు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు తెలియకుండా పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని అనేక శాఖల్లో ఆర్టీఐ దరఖాస్తుల్లో 95నుంచి 98% వరకు పెండింగ్‌లోనే ఉన్నదని పేరొన్నారు. రాష్ట్రంలో 12వేలకు పైగా ప్రజా సమాచారం అధికారు లు (పీఐవో) ఉన్నప్పటికీ, కేవలం 200కు తకువ శాఖలే ఆన్లైన్లో నమోదు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించా రు. డిజిటల్ యుగంలో ప్రజలకు సమాచా రం సులభంగా అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులుగా తాము ఆర్టీఐ కింద సమాచారం కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. హెచ్ఎండీఏ, హైడ్రా, జీహెచ్ఎంసీ వంటి సంస్థల వద్ద సమాచారం కోరినా సమాధానం రావడం లేదని తెలిపారు. ఇది ప్రజాప్రతినిధుల బాధ్యతలను నిర్వర్తించడంలో అడ్డంకిగా మారుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్‌కాల్స్, లేఖలకు సమాధానం ఇవ్వకపోవడం వంటి పరిస్థితులు కేవలం తనకే కాకుండా మండలిలో ఉన్న అనేకమంది సభ్యులు ఎదురొంటున్న తీవ్రమైన సమస్య అని తెలిపారు. ఈ పరిస్థితిపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టిసారించి, ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని దాసోజుశ్రవణ్ కోరారు.