Hyderabad | పెద్దఅంబర్‌పేట, మార్చి 4 : గూగుల్‌లో ఆలయాలను శోధిస్తారు. రెక్కీ నిర్వహించి రాత్రికి రాత్రి ఆభరణాలు నొక్కేస్తారు. ఆ ఆభరణాలను బిస్కెట్లుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇలా చోరీ సొత్తును తరలిస్తుండగా పట్టుబడిన ఇద్దరిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన మహ్మద్ ఇంతియాజ్ షరీఫ్, రంగా వేణు డబ్బులు సంపాదించడానికి గూగుల్‌లో ఆలయాల గురించి శోధించి విగ్రహాలకు ఉన్న ఆభరణాల చోరీలకు పాల్పడుతారు. మంగళవారం పెద్దఅంబర్‌పేటలోని అవుటర్ రింగు వద్ద అనుమానంతో వీరిని పోలీసులు తనిఖీ చేయగా.. వెండి బిస్కెట్లు కనిపించాయి. విచా రించగా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో వీరిపై కేసు ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల పేరుతో వందలాదిమంది వద్ద నుంచి రూ.14 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన సంస్థ నిర్వాహకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీసీపీ కే ప్రసాద్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కందుల శ్రీనివాసరా వు వెల్విజన్ గ్రూప్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశాడు. తాను పెట్టిన స్కీంల్లో డబ్బులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి 200 మంది నుంచి రూ.14 కోట్లు వసూలు చేశాడు. ఆ తరువాత లాభాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు.