హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ పరిశోధన-సాంకేతిక బదిలీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని ఐకార్-ఐఐఆర్ఆర్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐసీఏఆర్-ఐఐఆర్ఆర్) ఇండస్ట్రీ మీట్-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రాప్ సైన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీకే యాదవ్ మాట్లాడుతూ వ్యవసాయంలో ఉత్పత్తి పెరిగేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్వీ సా యిప్రసాద్, డాక్టర్ ఎంబీబీ ప్రసాద్‌బాబు, డాక్టర్ సీ కన్నన్ సంస్థ ద్వారా అభివృద్ధి చేసిన పలు వరి రకాలను వివరించారు. డీఆర్ఆర్ దాన్ 48, డీఆర్ఆర్హెచ్ 6, సాయిల్ టెస్టింగ్ కిట్లకు సంబంధించి ప్రైవేట్ సంస్థలతో ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.