Insurance | ఓలా, ఉబర్, గిగా డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.5లక్షల బీమా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల కోసం రూ.5లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ గిగ్ వర్కర్లు సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు.
రాజస్థాన్లో చేపట్టిన చట్టాన్ని అధ్యయనం చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. నాలుగు నెలల క్రితం కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ఇచ్చిన హామీ మేరకు రిజర్వాన్ కుటుంబీకులకు రూ.2లక్షల చెక్కును శనివారం సచివాలయంలో అందజేశారు.