TGSRTC Discount Offer | ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ని ప్రకటించింది. ఈ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణంపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ కోసం tgsrtc.telangana.gov.in వెబ్సైట్ని సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తడంతో హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 36 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతి స్వల్పంగా తగ్గడంతో మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు టికెట్లపై రాయితీని ప్రకటించింది.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఆ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని #TGSRTC కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.… pic.twitter.com/2vE6Z9e6Xb
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 4, 2024