యాదగిరిగుట్ట, జనవరి11: ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేస్తున్న భూ అక్రమ దందాల చిట్టా త్వరలో విప్పనున్నట్టు ఎన్డీసీసీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కార్యాయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొలనుపాకలో జంగయ్య యాదవ్ భూమి తాకట్టు పెట్టిన మార్వాడీకి ఫోన్ చేసి పిలిపించుకుని బినామీల పేరిట 7.27 ఎకరాల పట్టా చేసుకున్నారని ఆరోపించారు.
నియోజకవర్గంలో ప్రతి క్రషర్ మిషన్ల నుంచి నెలకు రూ. 2 లక్షలు వసూళ్లు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దే అక్రమ భూ దందాల చిట్టా ఉందని ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లనే చెప్పాడని గుర్తుచేశారు. అక్రమ దందాలపై నియోజకవర్గానికి క్యాబినెట్ హోదాలో సేవలు చేసిన మహిళా నాయకురాలు గొంగిడి సునీత ఆరోపిస్తే సమాధానం చెప్పలేక సిగ్గులేకుండా ఇష్టమొచ్చిన్నట్టు దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గొంగిడి సునీతకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, బీర్ల అయిలయ్య భూ దందాలపై సీబీఐ, ఈడీ కేసు పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.