తెలంగాణలో సాగుకు స్వర్ణయుగం
సీఎం కేసీఆర్ విజన్‌తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
- సత్ఫలితాలనిస్తున్న కేసీఆర్ విజన్
- వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
ఖమ్మం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ విజన్‌తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను శుక్రవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో రాష్ర్టాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతుండగా, తెలంగాణలో మాత్రం సాగు ఉత్పత్తులు ఏటా పెరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా గోదాము లు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ధాన్యం దిగుబడి 62 లక్షల టన్నులు ఉండగా గతేడాది 3 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ప్రస్తుతం 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు.
విత్తన భాండాగారంగా తెలంగాణ
సీఎం కేసీఆర్ విజన్‌తో రాష్ట్రం దేశానికే విత్తన భాండాగారంగా అవతరించిందని మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్ అన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలు చేస్తున్నారని చెప్పారు. నీటిని ఒడిసిపట్టే పనులకు తెలంగాణ సర్కార్ ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, జడ్పీ చైర్మన్ కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

