హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘తమ్మిడిహట్టి (Tummidihatti) నుంచి 160 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి (Yellampalli) తరలించవచ్చు. బరాజ్ నిర్మించి చూపిస్తాం. కేసీఆర్ (KCR) కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. లక్ష కోట్లు వృథా చేశారు’ ఇదీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటివరకు చేసిన ప్రచారం. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కా ర్.. ఎల్లంపల్లికి నీటిమళ్లింపు అసాధ్యమే గాక, ఆర్థికభారం అంటూ సన్నాయి నొక్కులు నొ క్కుతున్నది. నిరర్థకమన్న ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే వినియోగించుకునేందుకు ఇప్పుడు సిద్ధమైంది. ఇప్పటివరకు చేసిన ప్రచారమంతా ఉత్తదేనని అదే కాంగ్రెస్ అంగీకరించినట్టయిం ది.
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా, సుందిళ్లకు నీటిని మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటమే అందుకు నిదర్శనంగా నిలిచింది. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ద్వారా 12.20 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు 2007లో రూ.17,875 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ అనుమతులను మంజూరు చేశారు. ఆ తర్వాత అదనంగా నల్లగొండలో 67,500 ఎకరాలను, ఉమ్మడి రంగారెడ్డిలో 1.50 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి స్టేజ్-2, 3 కలిపి 1.24లక్షల ఎకరాలను కలిపారు. మొత్తంగా 150 రోజులపాటు 160 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నాడు కాంగ్రెస్ నిర్ణయించింది.
అదీ 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మిస్తేనే సాధ్యమని తేల్చింది. కానీ బరాజ్ నిర్మించకుండానే కాల్వలు తవ్వింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టును రెండుగా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వార్దాపై బరాజ్ నిర్మించి 20 టీఎంసీలతో 2 లక్షల ఆయకట్టుకు నీరిచ్చేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుగా, కాళేశ్వరం ప్రా జెక్టు ద్వారా మొత్తంగా 240 టీఎంసీలను వినియోగించుకుంటూ కొత్త స్థిరీకరణ కలిపి 36 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలను సిద్ధంచేసింది. ప్రస్తుతం మొత్తంగా ప్రాణహితపై ఆధారపడి 38 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఆధారపడి ఉన్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ మళ్లిస్తామని చెప్తున్న 80 టీఎంసీలతో ఈ ఆయకట్టులో పావుశాతం ఆయకట్టుకు సైతం నీరందదు. మిగతా ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వాలంటే తుదకు కాళేశ్వరం ప్రాజెక్టునే వినియోగించుకోవాలి. అందుకోసమే తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా, సుందిళ్లకు నీటిని మళ్లించేందుకు కొత్తగా ప్రణాళికను సిద్ధం చేసింది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయడం, అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన రిజర్వాయర్లకు, ఆయకట్టుకు నీరివ్వడం గతంలో మాదిరిగా యథావిధిగా కొనసాగనున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆది నుంచీ అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. మేడిగడ్డ బరాజ్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సాకుగా చూపుతూ బరాజ్‌లే నిరర్థకమంటూ అసత్య ప్రచారం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు సైతం పనికిరావని, ఎప్పుడు కూలిపోతా యో తెలియదంటూ దుష్ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళేశ్వరం ప్రా జెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌ను వినియోగించుకునేందుకే సిద్ధమైంది.
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా గోదావరి జలాలను సుందిళ్ల బరాజ్‌కు తరలించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. నిర్దేశిత 160 టీఎంసీల జలాలు, అదీ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి మళ్లించడం తరలించడం అసాధ్యమని ఇంజినీర్లు తేల్చిచెప్పాక గానీ కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరవలేదు. ఇప్పుడు బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. గతంలో చేసిన ప్రచారమంతా తప్పని కాంగ్రెస్ ప్ర భుత్వమే అంగీకరించింది. ఎల్లంపల్లి నుంచి నీటి మళ్లింపునకు అధిక మొత్తంలో నిధు లు అవసరమని, తక్కువ వ్యయం కోసమే సుందిళ్లకు మళ్లిస్తున్నామని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.