హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశాన్ని 7న నిర్వహించనున్నారు. బోర్డు చైర్మన్ రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందజేశారు. రెండు రాష్ర్టాల అభిప్రా యం మేరకు సమావేశ తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ, జీఆర్ఎంబీ మాత్రం ఏకపక్షంగా తేదీని ఖరారు చేస్తున్నదని తెలంగాణ, ఏపీ అధికారులు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో జీఆర్ఎంబీ సమావేశం మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షికపరీక్షలు బుధవారంతో ముగిశాయి. జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 7 నుంచి 15వరకు 9 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.