భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నదిలో పెద్దఎత్తున నీరు వరస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి ఉధృతికి తెలంగాణ-ఛత్తీస్గఢ్ ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
#WATCH | Telangana: Godavari River flows above the danger mark at Telangana's Bhadrachalam.
Relief operations are being undertaken in the villages here and all district officials are on high alert. (29.07) pic.twitter.com/lyLfzEDaay
— ANI (@ANI) July 30, 2023