సిద్దిపేట అర్బన్, మార్చి 21 : తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పం తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి గోస’ పేరుతో గోదావరి నది నుంచి కొండపోచమ్మసాగర్ వరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహా పాదయత్ర గురువారం రాత్రి సిద్దిపేట పట్టణానికి చేరింది. శుక్రవారం రెడ్డి ఫంక్షన్హాల్లో ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. ప్రతి ఎకరాకు నీళ్లు అం దించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం నిర్మిస్తే.. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా గోదావరి నదిలో నీళ్లు నింపకపోతే తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.