Godavair Pushkaralu : తెలంగాణలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ పుష్కరాల వేడుకను జరుపనున్నారు. 8 రోజుల పాటు నిర్వహించనున్న పుష్కరాలను పునస్కరించుకొని.. గోదావరి ఒడ్డున గల దేవాలయాలతో సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నారు.
బాసర నుంచి భద్రాచలం వరకూ గోదావరి తీరాన వెలసిన పుణ్యక్షేత్రాలను కలుపుతూ.. టెంపుల్ సర్క్యూట్స్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి 15లోపు కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుందని, అనంతరం ఆ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని వెల్లడించారు మంత్రులు.