Goda Kalyanam | ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మైదానంలో గోదాదేవి శ్రీనివాస కల్యాణ కనులపండువలా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. జగదీశ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి అన్నితామై గోదా శ్రీనివాస కల్యాణోత్సవం జరిపించారు. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా గోదా శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణు స్వామి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం జరిగింది.
Goda Kalyanam 01