ములుగురూరల్, ఆగస్టు19: గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు తీరని అన్యాయం చేసే జీవో నంబర్ 29ని తక్షణమే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రూప్-1 ఓపెన్ క్యాటగిరీ పోస్టులకు 1:50 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల వర్గాలకు చెందిన వారు ఉన్నారో ప్రభుత్వం బయటపెట్టాలని నిలదీశారు. జీవో నంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.