హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి.