పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నీట్ పీజీ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్షిప్ వచ్చే ఏడాది జూలై 31న ముగియ నున్నట్టు పేర్కొన్నది.