హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : నీట్ పీజీ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్షిప్ వచ్చే ఏడాది జూలై 31న ముగియ నున్నట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డుతో చర్చించి ప్రాథమికంగా తేదీని నిర్ణయిం చినట్టు తెలిపింది.