ఫార్మాసిటీ జీవో 31 రద్దు చేయాలి
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీ జీవో 31ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో పనులను మానుకోవాలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది.
- ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్
కవాడిగూడ, మే 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీ జీవో 31ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చిన భూముల్లో పనులను మానుకోవాలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. శనివారం ఇందిరాపార్కు వద్ద కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల అధ్యక్షతన జరిగిన ధర్నాలో సైంటిస్ట్ ఫర్ పీపుల్ డాక్టర్ కే బాబూరావు, తెలంగాణ పీపుల్స్ జేఏసీ నాయకుడు కన్నెగంటి రవి, ఎమ్మెల్సీ కోదండరాం, దళిత బహుజనఫ్రంట్ నాయకుడు శంకర్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, తెలంగాణ ఉమన్ అండ్ ట్రాన్స్జెండర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్ సజయ, పలు పార్టీల నాయకులు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసైన్డ్ భూములకు శాశ్వత పట్టా హక్కు కల్పించాలని అన్నారు.
ఆన్లైన్లో తొలగించిన రైతుల పేర్లను మళ్లీ ఎక్కించి రిజిస్ట్రేషన్ హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన అసైన్డ్ రైతులకు అదనపు పరిహారంపై ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కూలీలకు పూర్తి పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే ఫార్మాసిటీ, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను గౌరవించి కర్ణాటకలో చేసినట్టుగా ఇక్కడ కూడా భూసేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

