(రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : కాంగ్రెస్ సరారు ప్రతిష్ఠాత్మకంగా మీర్ఖాన్పేటలో చేపట్టిన గ్లోబల్ స మ్మిట్ అతి పెద్ద ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నదా? ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నదా? విజన్ డాక్యుమెంట్-2047 రిలీజ్ పేరుతో ప్రభు త్వం చేసిన హడావుడి ఉత్తడొల్లేనని తేలిపోయిందా? తొలిరోజు అంతంత మాత్రంగా జరిగిన సమ్మిట్.. రెండోరోజు అట్టర్‌ఫ్లాప్ షోగా మారిందా? రెండో రోజు డెలిగేట్స్, ఇన్వెస్టర్స్ లేక సదస్సు వెలవెలబోయిందా? రెండు రోజుల సమ్మిట్‌లో రూ.5.75 ల క్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 13లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్తున్న కాంగ్రెస్ నేతల ది డొల్లమాటలేనా? అవన్నీ డబ్బా ప్రకటనలేనని సొంత పార్టీ నేతలే నిష్టూరమాడుతున్నారా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. మూడు నెలలుగా ఊదరగొట్టినా క్షేత్రస్థాయి గ్లోబల్ సమ్మిట్ ఘోరంగా విఫలమైందని ప్రభుత్వ పెద్దలే పెదవివిరుస్తున్నారు. దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు తుస్సుమన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డెలిగేట్స్ రాకపోవడంతో విద్యార్థులతో మమ
మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆర్జనకు త గ్గట్టు అంటూ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌పై అట్టహాసపు ప్రచారం చేసింది. ముఖేశ్ అంబానీ, అదానీ, మిట్టల్, ఒబెరాయ్ వంటి పెద్ద సంస్థల దిగ్గజాలు హైదరాబాద్‌కు తరలి వస్తారని సీఎం కార్యాలయం అధికారిక ప్రకటనలు, అనధికారిక లీకులతో బొం బాట్ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా వేదికపై అసలు రంగు బయటపడ్డది. ప్రచారంలో హిట్ అ యినట్టు కనిపించినా క్షేత్రస్థాయిలో సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ టాక్ గట్టిగా వినిపిస్తున్నది. మొదటి రోజు ఓ వర్గం మీడియా కాస్త హడావుడి చేసినా రెండో రోజు కనీస స్పందన కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేశాయే తప్ప.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు సమ్మిట్‌పై ఎకడా ప్రత్యక్ష ప్రసారాలు కనిపించలే దు. దీంతో ప్రభుత్వానికి ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని ఆందోళన చెందిన ప్రభుత్వం పెయిడ్ ప్రసారాలతో నెట్టుకొచ్చింది. కొన్ని జాతీయ చానళ్ల యాజమాన్యాలతో మాట్లాడుకొని పెయిడ్ లైవ్ ప్రసారాలు చెయించినట్టు ప్రచారం జరుగుతున్నది. 5వేల మంది డెలిగేట్స్ కోసం వేదిక సిద్ధం చేయగా కనీసం 1500 మంది కూడా రాకపోవడంతో అధికారులు స్థానికంగా ఉన్న ఎంబీఏ విద్యార్థులను తరలించి ఖాళీ కుర్చీలను నింపే ప్రయత్నం చేశారు. వారికి పాస్ కూడా ఇవ్వకుండానే నేరుగా అనుమతించేశా రు. అయినా ఖాళీ కుర్చీలు కనిపించడం గమనార్హం.
మాటిచ్చి హిమాచల్ సీఎం డుమ్మా
సదస్సుకు పక్కాగా వస్తానని హామీ ఇచ్చిన హి మాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు చివరి నిమిషంలో ముఖం చాటేశారు. సమ్మిట్ జరుగుతు న్న తీరుపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న ఆ యన, నివేదిక ఆధారంగా తన పర్యటనను చివరి ని మిషంలో రద్దు చేసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఆయన తెలంగాణ ప్రభుత్వంతో విద్యుత్తు కంపెనీల ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నది. కానీ తాను వెళ్లి ఒప్పందాలు చేసుకునేంత గొప్ప స్థాయిలో సమ్మిట్ జరగడం లేదనే నివేదికతో సుఖ్వీందర్ సింగ్ సుఖు మనసు మార్చుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ వివరాలు ఆద్యంతం గోప్యం
రెండు రోజులుగా జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 13 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గొప్పగా ప్రకటించారు. విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని, జెనో, రెడో, సింగరేణి సంస్థలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పారు. కొన్ని కంపెనీల పేర్లను బహిరంగంగానే ప్రకటించారు. కానీ, పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు ఏవి? ఎవరా గ్లోబల్ ఇన్వెస్టర్లు? వాటిలో లిస్టెడ్ కంపెనీలు ఏవి?, అన్‌లిస్టెడ్ కంపెనీలు ఏవి? ఎవరెవరికి ఎంవోయూలు ఇచ్చారు? అనే విషయాలను ఎకడా అధికారికంగా బయటపెట్టలేదు.
లిస్టెడ్ కంపెనీల పెట్టుబడి వివరాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా మౌనమే పాటిస్తున్నది. రేవంత్ సరార్తో ఎంవోయూలు కుదుర్చుకున్న ఆ విదేశీ కంపెనీలేంటో తెలుసుకుందామకున్న రాష్ట్ర ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. కనీసం విదేశీయుల ముఖాలు అయినా చూద్దామంటే రెండో రోజు విదేశీ ఇన్వెస్టర్లు ఎవరూ కనిపించలేదు. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా ఉన్న మహీంద్రా గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వచ్చారు. ప్రసంగించారు. కానీ, తన గ్రూప్ కంపెనీల పెట్టుబడుల ప్రస్తావన ఏదీ లేదు.
అన్నింటా ఆ ముగ్గురే
ప్రభుత్వ పనితీరును ప్రతిబింబించే విధంగా అందరు మంత్రులు వేదికమీద ఉండాల్సింది. కానీ, క్యాబినెట్ మంత్రుల్లో సగం మంది కూడా సదస్సు వేదికపై లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ ముగ్గురికి తప్ప వేదిక మీద ఇంకెవ్వరికీ చోటు లేదనే వైఖరిని అధికారులు ప్రదర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తప్పితే మిగిలిన మంత్రులకు వేదిక మీద ప్రాముఖ్యత లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రికే ప్రాముఖ్యత కలిగిన సీటులేదు. పరిశ్రమలశాఖ మంత్రికి సైతం వెనుక తొక్కులే తొక్కారు. వేదిక మీద ఆయన ఉనికి అంతంత మాత్రమే. కొందరు మంత్రులను కేవలం వారి శాఖల వరకు మాత్రమే అనుమతించారు. సమ్మిట్ ఫ్లెక్సీల్లో ఒకచోట కూడా ఆ మంత్రి ఫొటో లేదు.
సమ్మిట్‌కు వెళ్లిన కొందరు మంత్రులు అధికారుల తీరుపై అలిగినట్టు తెలిసింది. కొందరు సీనియర్ మంత్రులు, ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షీ నటరాజన్ సమ్మిట్‌కు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమ్మిట్‌కు హాజరు కావాలని సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అయినా 80 శాతం మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సదస్సుకు దూరంగా ఉన్నారు. మొత్తానికి పెట్టుబడులు రాకపోగా, వందల కోట్ల ప్రజాధనం వృథా అయిందనే మాటలే అంతటా వినిపిస్తున్నాయి. ముఖ్యనేత వాణిజ్య ఎల్లో మీడియాలో మాత్రం ‘అహో.. ఒహో’ అనే ప్రచారం మినహాయిస్తే..రెండు రోజుల సమ్మిట్ సక్సెస్ అయ్యిందనే మాట కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచే రాకపోవడం గమనార్హం.
పద్ధతి, ప్రణాళిక లేని సదస్సు
సదస్సు నిర్వహిస్తున్నారంటే ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనేదానికి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. కానీ అదేమీ లేదని స్పష్టంగా కనిపించింది. మొదటిరోజే భోజనాల కోసం జనాలు ఎగబడ్డ పరిస్థితిని చూశాం. కనీసం టాయిలెట్ల సౌకర్యం లేక డెలిగేట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సమ్మిట్ నుంచి తీవ్ర అసహనంతో కొందరు ఇన్వెస్టర్లు బయటికొచ్చేసిన పరిస్థితి నెలకొన్నది. సమ్మిట్ అతిథుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాత్రివేళ గాలా డిన్నర్ ఏర్పాటు చేసింది. సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరి ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం గోల్డ్ కార్డు ఉన్న అతిథులనే అనుమతించారు.
అధికారుల నిర్వాకంతో మిగిలిన అతిథులు ఇబ్బందులు పడ్డారు. ఇది ఈవెంట్‌కు పిలిచి తమను అవమానించడమేనని అధికారులతో గొడవకు దిగారు. దీంతో తమ తప్పు తెలుసుకున్న అధికారులు వారిని గాలా డిన్నర్‌కు అనుమతించారు. పోనీ రెండోరోజైనా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? అంటే అస్సలు రాలేదు. కనుచూపు మేరలో ఎకడా డెలిగేట్స్, ఇన్వెస్టర్స్ కనిపించలేదు. ఎంబీఏ కాలేజీల నుంచి విద్యార్థులను తరలించారు. స్వయంగా ఈ విషయాన్ని విద్యార్థులే మీడియాకు చెప్పారు. తాము ఫలానా కాలేజీ నుంచి వచ్చామని తెలిపారు. రెండురోజుల సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని డెలిగేట్సే చెప్తున్నారు.