హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానున్నది.
ఈ సమ్మిట్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారమే విశాఖకు చేరుకున్నారు. విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఏర్పాటును స్వాగతిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ర్టాలుగా ఉండాలని ఆకాంక్షించారు.