హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులివ్వాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొందరికి పదోన్నతులిచ్చినా.. ఇంత వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదని, వారికి తక్షణమే పోస్టింగ్స్ ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. టీఈఈఏ 2025 డైరీ, క్యాలెండర్ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ప్రజాభవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఈఈఏ నేతలు మాట్లాడుతూ.. గతంలో పదోన్నతులు పొంది ఏపీ ఉద్యోగుల రాకతో రివర్షన్ అయిన ఇంజినీర్లకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్చేశారు. త్వరలోనే స మావేశమై అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని డిప్యూటీ సీఎం హామీ ఇ చ్చినట్టు నేతలు తెలిపారు. టీఈఈఏ అ ధ్యక్షుడు ఎన్ శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్యశెట్టి, తదితరులున్నారు.