హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టీచర్ల పాలిట శాపంగా మారిన టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీచర్ ఎమ్మెల్సీలు, తపస్, పీఆర్టీ యూ టీఎస్ ముక్తకంఠంతో నినదించాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాయి. బుధవారం సచివాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నిర్వహించిన సమావేశం అనంతరం టీచర్ ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మల్క కొమురయ్య, ఏవీఎన్‌రెడ్డి, పీఆర్టీ యూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధా న కార్యదర్శి నవాత్ సురేశ్ వేర్వేరుగా సీఎం రేవంత్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చే యాలని సీఎంవో కార్యదర్శి శేషాద్రిని సీఎం ఆదేశించినట్టు ఎమ్మెల్సీ లు ప్రకటించారు. యూటీఎఫ్, ఎస్టీఎఫ్ఐ పక్షాన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ఢిల్లీలో ప్రకటించారు.