చిత్తశుద్ధి ఉంటే భారతరత్న ఇవ్వండి

- ఓట్ల కోసమే పీవీ సమాధి వద్ద రాజకీయ డ్రామాలు
- ఎన్టీఆర్‌ను ఎందుకు పట్టించుకోలేదు
- ఎంపీ బండి సంజయ్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపాటు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/చిక్కడపల్లి: బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గాంధీనగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసమే పీవీ సమాధి వద్ద ఎంపీ బండి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని, పీవీకి భారతరత్న ప్రకటించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్నదని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరదసాయంపై రాష్ట్రం నివేదిక పంపలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని, ఎలాంటి నివేదిక పంపకుండానే వరదలు వచ్చిన 6 రాష్ర్టాలకు కేంద్ర హోంశాఖ రూ.4,700 కోట్ల తక్షణ సాయం అందించిందని, దీనిపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు, పాకిస్థానీలు ఉంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వానిది కాదని చురకలంటించారు.
వైభవంగా పీవీ శతజయంత్య్సువాలు..
టీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ శతజయంత్య్సువాలను ఏడాది పొడవునా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నదని, కానీ నేటివరకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, మరో పార్టీ దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్లకు భారతరత్న ప్రకటించకుండా, జీహెచ్ఎంసీలో ఓట్లు అడిగే అర్హత బీజేపీకి లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేస్తున్న బీజేపీ నేతల విచిత్ర ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని, ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ మత రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం ఇష్టారీతిన మాట్లాడే పార్టీలను ప్రజలు నమ్మవద్దని, నిరంతరం ప్రజల కోసమే పనిచేసే టీఆర్ఎస్ పార్టీకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు