హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐన్యూస్ ఎండీ శ్రావణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయగా జస్టిస్ జువ్వాడి శ్రీదేవి సోమవారం విచారణ జరిపారు. ఫోన్ల ట్యాపింగ్‌తో శ్రావణ్‌కుమార్‌కు సంబంధం లేదని, నిందితుల వాంగ్మూలాల్లో వాస్తవం లేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొంటూ.. పోలీసుల దర్యాప్తునకు శ్రావణ్సహకరిస్తారని తెలిపారు. దీంతో శ్రావణ్‌కుమార్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలంటూ జస్టిస్ పోలీసులకు నోటీసులు జారీచేశారు.