తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు దుర్మరణం
తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది.
చారకొండ, మే 31: తాటిచెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. ఎస్సై వీరబాబు తెలిపిన కథనం ప్రకారం.. చారకొండకు చెందిన జెల్ల రామస్వామి(50), కల్లు గీసుకొని జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉప్పునుంతల మండలంలో బంధువులు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చాడు. రాత్రి 7 గంటల సమయంలో తాటికల్లు గీయడానికి పొలం దగ్గరికి వెళ్లాడు. రాత్రి 9 గంటలు దాటినా రామస్వామి ఇంటికి రాకపోవడంతో భార్య శ్యామలమ్మ, కొడుకు సాయి స్థానికులతో కలిసి తాటివనంలోకి వెళ్లి చూడగా కల్లుగీసే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలాన్ని ఎస్సై వీరబాబు పరీశీలించారు. ఆదివారం ఉదయం మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

