YS Jagan residece : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్మోహన్రెడ్డి నివాసం ఉంది. ఆ ఇంటి ఆవరణలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సెంట్రీని నిర్మించారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేసినందున శనివారం జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెంట్రీని నిర్మించినందుకే దాన్ని కూల్చివేశామని అధికారులు చెప్పారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి రెండు వారాలు కూడా కాకముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జగన్ ఇంటి దగ్గరి సెంట్రీని కూల్చివేయించారని వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఆ అక్రమ నిర్మాణం ఊసే ఎత్తలేదని, ఇప్పుడు చంద్రబాబు ఏపీ సీఎం కాగానే ఏకంగా ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారని విమర్శలు వస్తున్నాయి.
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్లో అక్రమణాల కూల్చివేత
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెంట్రీని తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది. pic.twitter.com/e4pRCahuM6
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2024