హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లంతా మూకుమ్మడిగా బంద్ చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. బకాయిలు చెల్లించేవరకు చేపడుతున్న పనులతోపాటు కొత్త పనులకూ దూరంగా ఉంటామంటూ జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీచేశారు.
రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. వర్షాలకు అత్యవసర బృందాల ఏర్పాట్లు, ఐఆర్టీ బృందాలకు ప్రత్యేక సహాయక చర్యల పనులను తాము చేయబోమని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పారు.