Transport Department | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చెక్‌పోస్టుల నుంచి రోజుకో రూ.కోటి.. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ప్రమోషన్‌కు రూ.కోటి.. ఇలా రవాణాశాఖలో ‘కో.. అంటే కోటి’ అన్నట్టుగా మా మూళ్ల దందా సాగుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ మొత్తం ప్రభుత్వానికి చెందిన ఓ పెద్ద మనిషి సన్నిహితుడి చెరలో చిక్కిందని జోరుగా ప్రచారం సాగుతున్నది. స్వయంగా ఆ శాఖ ఉద్యోగులే ఈ ఆరోపణలు చేస్తున్నారని.. ఈ పంచాయితీ ఏకంగా ఢిల్లీకి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ఉన్నతోద్యోగిపై కేంద్ర ప్ర భుత్వానికి, ప్రభుత్వ పెద్ద సన్నిహితుడిపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారంటూ రెండు లేఖలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రె స్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కమిటీ సభ్యులకు ఆ లేఖలను పంపుతున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. గతంలో రవాణాశాఖలో పనిచేసిన ఓ వ్యక్తి ప్రభుత్వ పెద్ద దగ్గర చేరారని ఆ లేఖల్లో పేర్కొన్నా రు. ఆయన రవాణాశాఖను తన గుప్పిట్లోకి తీసున్నారని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 13 చెక్‌పోస్టుల నుంచి రో జూ 1.20 కోట్లు వసూలు చేస్తున్నారని సోషల్‌మీడియా పోస్టుల్లో వెల్లడించారు. ఆ సొమ్ము ప్రభుత్వ పెద్ద సన్నిహితుడితోపాటు రవాణాశాఖలోని ఓ ఉన్నతాధికారికీ వెళ్తున్నాయని ఆరోపించారు.
మీటింగ్.. రైడింగ్..
సదరు ప్రభుత్వ పెద్ద సన్నిహితుడు.. రవాణాశాఖలో ఇద్దరికి అక్రమంగా పదోన్నతులు ఇచ్చేందుకు రూ.కోటి చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సీనియార్టీ జాబితాలో వా రు చాలా వెనుకబడి ఉండటంతో భారీ స్కెచ్ వేశాడని చెప్పుకుంటున్నారు. ఆ జాబితాలో ముందున్నవాళ్లతో ఓ మీటింగ్ పెట్టాడని, తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పి, బెదిరించి, ‘మాకు ఇప్పుడు ప్రమోషన్ వద్దు’ అని బలవంతంగా లేఖలు రాయించుకున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఒకరిద్దరు వ్యతిరేకించగా.. ఆ వెంటనే వారి వారి కార్యాలయాలపై దర్యాప్తు సంస్థల దాడులు జరిగాయని చెప్పుకుంటున్నారు. ఇది తెలిసి ఆ సంస్థ ఉన్నతాధికారి సైతం విస్తుపోయారని.. ఫిర్యాదు లేకున్నా ఎలా దాడులు జరిగాయని ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతున్నది. తనను ఎదిరిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక నమూనాగా ఈ దాడులు జరిపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరి ప్రమోషన్ ఫైల్ ఇప్పుడు తుదిదశకు చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం తెలిసి ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధి అసహనం వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు.
ఢిల్లీకి చేరిన పంచాయితీ
ఈ వ్యవహారం ఢిల్లీకి చేరినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఆర్టీఏ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పేరుతో రెండు లేఖలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకదానిలో రవాణాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్ద సన్నిహితుడి దయతో తాను ఆ ఉద్యోగంలో చేరినట్టు ఉన్నతాధికారి పదే పదే జపం చేస్తున్నారని, పూర్తిగా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అందులో ఆరోపించారు. ఈ లేఖను సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కూ పంపినట్టు తెలిపారు. మరో లేఖను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసినట్టు వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వ్యక్తి ప్రభుత్వంలోని అత్యం త కీలక వ్యక్తి దగ్గర పీఏగా చేరారని పేర్కొన్నారు. ఆయన ఓ చిరుద్యోగి అని, ప్రస్తుతం తాను ఉన్న స్థా నాన్ని అడ్డుపెట్టుకొని మొత్తం రవాణాశాఖనే గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఆర్టీఏ చెక్‌పోస్టులు, అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్ల దందా చేస్తున్నారని, దీనిపై విచారించి, చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.