రేపే పల్స్ పోలియో
పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుకలు వేయనున్నారు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెంట ర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలవరకు చుక్కలు వేయనున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో మాత్రం రాత్రి 8 గంటల వరకు చుక్కలు వేయనున్నారు. ఆ తర్వాత రెండు రోజులపాటు సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వేస్తారు. రాష్ట్రంలో 38 లక్షల మందికిపైగా పిల్లలకు చుకలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ కార్యక్రమంలో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని వియజవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఎమ్మెల్యేలు ఏదో ఒక కేంద్రానికి వెళ్లి చుక్కల పంపిణీని ప్రారంభించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- drops
- kids
- Pulse polio
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

