Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన HILTP వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశంలో గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 80 శాతం పరిశ్రమల భూములు తెలంగాణేతరులకు కేటాయించారని తెలిపారు. పరిశ్రమల పేరుమీద కేటాయింపులు జరిపి తెలంగాణ వారికి అన్యాయం చేశారని విమర్శించారు.
చంద్రబాబు సూచనతో హిల్ట్ పాలసీ తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సుప్రీం కోర్టు రెడ్ జోన్ లో ఉండే, పొల్యూషన్ వచ్చే పరిశ్రమలను తరలించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, 70% నాన్ పొల్యూషన్ ఉండే పరిశ్రమలు తరలించి ప్రజల పొట్ట కొట్టడం తగదని అన్నారు. మూత పడ్డ పరిశ్రమల భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో జోన్ మార్పిడి చేయక భూములను కాపాడితే రేవంత్ రెడ్డి మార్కెట్ ధరకు కాకుండా ఎస్ఆర్ఓలో 30% ధరకు కేటాయించే ఏకైక సీఎంగా రికార్టు సృష్టించారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, తొట్ల స్వామి, PDSU నాయకులు మంద నవీన్, ఎస్. నాగేశ్వరరావు, హరీశ్, నాగరాజు, హరిబాబు, చాప భాస్కర్ దశరథ్, దర్శన్ శ్రీను నాయక్, నాగేంద్రబాబు, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.