BRSV | బీఆర్ఎస్వీ పోరుబాట విజయవంతం..ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని నిరసనలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో మూడు రోజులుగా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పో రుబాట విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పోరుబాటలో మూడోరోజైన బుధవా రం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి వృత్తి వి ద్యా కాలేజీల బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.
- ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని నిరసనలు
- మూడోరోజూ కాలేజీల బంద్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో మూడు రోజులుగా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పో రుబాట విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పోరుబాటలో మూడోరోజైన బుధవా రం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి వృత్తి వి ద్యా కాలేజీల బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.
బకాయిలు త్వరగా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 27న జిల్లాల్లో కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. 28న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్షల మంది విద్యార్థులు పోస్టుకార్డులు పంపి విజ్ఞప్తిచేశారు. వెంటనే ఫీజులు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 29న కా లేజీలు బంద్ చేసి నిరసన తెలిపారు. అన్ని జిల్లాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. సర్కార్ వెంటనే బకాయిలు చెల్లించకపోతే జూన్‌లో పోరుబాట మ రింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, పడాలసతీశ్ హెచ్చరించారు.
హాల్‌టికెట్లు ఆపితే సహించబోం!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సా కుగా చూపి విద్యార్థుల హాల్‌టికెట్లు ఆపినా, పరీక్షలు రాయకుండా అడ్డుకున్నా సహించబోమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించారు. కొన్ని కాలేజీలు హాల్‌టికెట్లు ఇవ్వడంలేదని, పరీక్షలకు అనుమతించడంలేదని తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, సదరు కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
2026 -27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాలేజీలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేని కాలేజీలను నడుపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులెవరూ చేరొద్దని, ఆ కాలేజీ సర్టిఫికెట్లు చెల్లవని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

