హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): గెజిట్ ద్వారా పేరు మార్పు చేసుకున్న పిటిషనర్ సర్టిఫికెట్లలో రెండు వారాల్లోగా పేరును మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. సవరించిన పేరుతో రెండు వారాల్లోగా సూల్, సెకండరీ బోర్డు, యూనివర్శిటీలు సర్టిఫికెట్లు జారీ చేస్తాయని తెలియజేసింది.
సర్టిఫికెట్లలో పేరు మార్పునకు సంబంధించి 1961లో జారీ అయిన జీవో 1263లోని నిబంధనలను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వీ మధుసూదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. దీంతో ఆ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.