నిజామాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భీంగల్ మండలంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నారు.
స్థానికుల సహకారంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న వాహనం, డ్రైవర్ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, భారీ వర్షాలు కురుస్తుంన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Gulab Cyclone | నిజామాబాద్లో గోదావరి ఉగ్రరూపం
మమతా బెనర్జీ పోటీ చేసే ఉపఎన్నికను రద్దు చేయం: కోల్కతా హైకోర్టు
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!