హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ) పేరుతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 22ఏ నిబంధనల దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదురొంటున్న బాధిత ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
22ఏ ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న బాధితులు.. సహాయం కోసం న్యాయవాది కల్యాణ్‌రావు 8125535604 నంబర్‌కు ఫోన్ చేసి తమ వివరాలను తెలియజేయవచ్చని తెలిపింది. ఈ హెల్ప్‌లైన్ ద్వారా బాధితులకు చట్టపరమైన మార్గదర్శకత్వం, న్యాయ సహాయం అందించనున్నట్టు తెలంగాణభవన్ వర్గాలు వెల్లడించాయి. అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఆస్తుల సమస్యలపై బాధితుల తరఫున పోరాటం చేయడంతోపాటు వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి.