Gas Cylinder Blast | హైదరాబాద్ : సిద్దిపేట జిలో్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి. ఈ పేలుడు ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శెట్టి కావ్య అనే మహిళ మంగళవారం ఉదయం స్టౌ వెలిగించింది. అప్పటికే గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. గ్యాస్ లీకైన విషయాన్ని ఆమె గమనించలేదు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగాయని పోలీసులు పేర్కొన్నారు.
దంపతులు కావ్య, భాస్కర్‌తో పాటు ముగ్గురు పిల్లలు ప్రణవి, కార్తీక, హర్షిణి, తాత అయ్యలం తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.