మంచిర్యాల, ఆగస్టు 21: సికిల్ సెల్(Sickle cell)రక్తహీనతతో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడికి అరుదైన ఏబీ-నెగెటివ్ రక్తాన్ని(AB Negative blood) అందించి ప్రాణదాతగా నిలిచారు మంచిర్యాల వాసి గర్క ఉజ్వల్. మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతున్న పి. మహాదేవాన్ష్కు అత్యవసరంగా AB-నెగెటివ్ రక్తం అవసరమని తెలియడంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ చొరవ తీసుకున్నారు. దీంతో ఉజ్వల్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తానికి సంబంధించిన పరీక్షలు పూర్తి చేసి పేషెంట్ తండ్రి శ్రీకాంత్‌కు అందజేశారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అరుదైన రక్తాన్ని దానం చేసిన ఉజ్వల్‌కు రెడ్‌క్రాస్ జిల్లా శాఖ తరఫున మహేందర్ అభినందనలు తెలిపారు. రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చచ్చన్నారు. రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమ్యలు రావని అపోహాలు వీడి రక్తదానం చేయాలని వారు సూచించారు.