భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి (Ganja) పట్టుబడింది. సారపాకలోని భద్రాచలం వంతెన సమీపంలో గంజాయిని తరలిస్తున్న కారు అదుతప్పి బోల్తాపడింది. దీంతో కారులోని గంజాయి బయటపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేలోపే కారు డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కారును సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకెళ్తున్నారనే విషయం తెలియాల్సి ఉన్నది.