మేడ్చల్ మల్కాజ్గిరి : జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్లో గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్న అయాజ్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ మొక్కల బరువు 4 కిలోలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మేడ్చల్లోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి (ganja) పట్టుబడిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి పరిధిలో ఉన్న కౌకుర్ దర్గా వద్ద రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకున్నారు. బైకులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు.