Ganja | నల్లగొండ : గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. రాష్ట్రంలో రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి.
నల్గొండ జిల్లాలో నడి రోడ్డుపై గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. తిప్పర్తిలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సంజీవరెడ్డి అనే కుటుంబంపై.. గంజాయి మత్తులో యువకులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. తిప్పర్తి హైవేపై అటుగా వెళ్ళే ఆర్టీసీ బస్సుపైన దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఓ లారీ మీదకు ఫోన్ విసిరికొట్టాడు. వేగంగా వెళ్తున్న వాహనాలకు అడ్డుగా వెళ్లి.. భయానక వాతావరణం సృష్టించారు. గంజాయి బ్యాచ్ వీరంగంతో స్థానికులు, వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. గంజాయి సేవించి.. దాడులకు పాల్పడుతున్న యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు
నల్గొండ జిల్లాలో నడి రోడ్డుపై గంజాయి బ్యాచ్ వీరంగం
తిప్పర్తిలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సంజీవరెడ్డి అనే కుటుంబంపై.. గంజాయి మత్తులో యువకులు దాడి
తిప్పర్తి హైవేపై అటుగా వెళ్ళే ఆర్టీసీ బస్సు పైన దాడి.. ఓ లారీ మీదకు ఫోన్… pic.twitter.com/RBjkKkFCmh
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025